అమరావతి ఆందోళనల నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కాస్తా చందాల బాబుగా మారిపోయారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో జేఏసీని ఏర్పాటు చేసిన చంద్రబాబు ఉద్యమ ఖర్చుల కోసం జోలెపట్టి అడుక్కోవడం మొదలెట్టారు. ఏ రోజు అయితే బాబుగారి సతీమణి నారా భువనేశ్వరీ తన రెండు బంగారు గాజులు త్యాగం చేసిందో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది. బాబు గారు స్వయంగా లక్ష విరాళం ప్రకటించారు. ఇక అమరావతి ప్రాంత మహిళలయితే రాజధాని కోసం తమ ఉంగరాలు, గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలతో సహా ఒంటిమీద బంగారమంతా సమర్పించేసుకుంటున్నారు. ఆ తర్వాత ఊరూరా తిరిగి జోలె పట్టి అడుక్కోవడం మొదలైంది. ఇప్పటి వరకు బందర్, రాజమండ్రి, తిరుపతిలో జోలె పట్టుకుని అడుక్కున చంద్రబాబు ఆ వచ్చిన డబ్బంతా అమరావతి జేఏసీకి ఇచ్చేస్తున్నారు.
అయితే గతంలో కూడా చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం చందాల బాబు అవతారం ఎత్తారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో అమరావతి రాజధాని సెంటిమెంట్ ప్రజల్లో ఉందని గమనించిన చంద్రబాబు పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారు. రాజధాని నిర్మాణంలో మీరూ భాగస్వామ్యంకండి అంటూ ఆన్లైన్లో ఇటుకలు అమ్మారు. ప్రజా రాజధానిలో ప్రజల భాగస్వామ్యం అంటూ హుండీలు ఏర్పాటు చేయించి విరాళాలు సేకరించారు. ఆన్లైన్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. అప్పుడు రాజధాని నిర్మాణానికి రూ. 57 కోట్లు సేకరించానని బాబుగారు స్వయంగా తిరుపతిలో చెప్పుకున్నారు. కాగా రాజధాని కోసం మేము కూడా కోట్లాది రూపాయలు వసూలు చేశాం..ప్రజలు ఇప్పుడు ఆ విరాళాలు మాకు ఇస్తారా అంటూ అడుతున్నారు..ఈ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలని బాబుగారి కుల మీడియాధిపతి తన ఆదివారం పలుకులో వాపోయాడు. దీన్నిబట్టి రాజధాని నిర్మాణం పేరుతో ఎన్ని వందల కోట్లు వసూలు అయ్యాయో, అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయో..అంతా బాబుగారికే తెలియాలి.
ఇప్పుడు అమరావతి పరిరక్షణ పేరుతో చంద్రబాబు మరోసారి చందాలు వసూలు చేస్తున్నారు. అంతే కాదు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. తాను స్వయంగా జోలె పట్టి విరాళాలు సేకరించడంతో పాటు, బ్యాంక్ అకౌంట్‌కు కూడా ఆన్లైన్లో నేరుగా డబ్బులు పంపాలని బాబుగారు బహిరంగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సదరు బ్యాంకు డీటైల్స్ కూడా సభాముఖంగా ప్రకటించారు. అమరావతి పరిరక్షణ సమితి పేరుతో సప్తగిరి గ్రామీణ బ్యాంకు, విజయవాడ బ్రాంచ్‌కు నేరుగా విరాళాలు పంపాలని బాబుగారు ప్రజలను కోరారు. అంతే కాదు..మీరు విరాళాలు పంపాల్సిన బ్యాంకు ఖాతా నెంబర్ : 500313331229 ను ఒకటికి మూడు సార్లు చదవి వినిపించారు. మొత్తానికి చంద్రబాబు కాస్త చందాల బాబుగా అవతారం ఎత్తారు. అయితే ఈ విరాళాలను ఎలా ఖర్చుపెడుతున్నారు..వీటికి ఎవరు జవాబుదారీ…అనే విషయంపై కూడా చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.