తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా రానున్న పది రోజులు అత్యంత కీలకం.. అందుకే గడపగడపకు వెళ్లి ప్రచారం చేయండి. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
గ్రామీణ నేతల సేవలను అందర్నీ ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ప్రజల్లో పార్టీపై.. ప్రభుత్వంపై సానుకూలత ఉంది. మనం దీన్ని ఉపయోగించుకోవాలి. అయిన కానీ ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు. ఈ ఎన్నికలు నా పనితీరుకు పరీక్షలాంటిది అని ఆయన అన్నారు.