అమరావతి ఆందోళనల నేపథ్యంలో జగన్ సర్కార్‌పై చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా కత్తిదూస్తోంది. ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయాడు. ఆ బీసీజీ రిపోర్ట్‌ను మీడియాకు వివరించిన దళిళ ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఆ విజయకుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ కించపర్చారు. నిజాయితీ గల దళిత ఐఏయస్ అధికారిపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రమంతటా నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ దళిత ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తిరుపతిలో బాబా సాహెబ్ విగ్రహం దగ్గర మూతికి నల్లగుడ్డ కట్టకుని నిరసన తెలిపారు.
అయితే తాజాగా సీఎం జగన్ చారిత్రాత్మక అమ్మ ఒడి పథకాన్ని బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు నుంచే ప్రారంభించారు. ఈ పథకానికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో రగలిపోయిన ఎల్లోమీడియా, టీడీపీ సోషల్ మీడియా టీమ్ బరితెగించింది. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులను జగన్ సర్కార్ అమ్మఒడి పథకానికి తరలిస్తుందంటూ అసత్య ప్రచారానికి తెగబడింది. ఈ మేరకు దళిత ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ‌్యలపై నిరసన తెలిపిన మేరుగ నాగార్జున ఫోటోను పోస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చెందిన నిధులు 1,271 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా తరలిస్తుందనే కారణంతో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున తిరుపతిలో బాబాసాహెబ్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కథ అల్లింది.ఇక సీఎం జగన్‌పై తిరుగుబాటు మొదలైంది అంటూ పచ్చ కథనాలు పచ్చిగా వండివార్చింది. ఈ పోస్ట్‌ను లోకేేష్ టీమ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. చూశారుగా.. పచ్చమాఫియా జగన్ సర్కార్‌ను బద్నాం చేయడానికి ఎంతగా బరితెగిస్తుందో..బాధ్యతాయుతమైన జర్నలిజం వృత్తిలో అయివుండి..ఇలా అసత్య కథనాలు పోస్ట్ చేయటానికి నిజంగా ఎల్లోమీడియాకు సిగ్గుండాలి. తమ కుల ప్రభువు చంద్రబాబు కోసం ఎల్లోమీడియా ఎంతగా బరితెగిస్తుందో ఈ ఉదంతం తెలియజేస్తోంది. ఛీఛీ..నవ్యాంధ్రకు చంద్రబాబు ఎంత శాపమో..ఎల్లోమీడియా అంతకంటే శాపంగా మారింది. అంతా ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ.