తెలంగాణ రాష్ట్రంలో ఈనెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవ్వడం ఖాయం.. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై తెరాస సెల్ బహరేన్ శాఖ అద్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అన్ని మున్సిపల్ శాఖలను కైవశం చేసుకోవడం తథ్యం అన్నారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి జరిగిన ప్రత్యక్ష ఎన్నికలన్నింటిలో ఎన్నారైటీఆరెస్ బహరేన్ శాఖ ప్రచారములో ముందుండి ప్రత్యక్ష, క్యాంపైనింగ్ చేసి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మేల్యేలు, ఎంపీమరియు ఇటీవలే తెలంగాణలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 32 జిల్లాలకు గాను 32 జిల్లాలలో జిల్లా పరిస్థితులను కైవసం చేసుకుని కొత్త చరిత్ర లిఖించింది.
ఈ అపూర్వ విజయాన్ని ప్రజలు అందించారు .ముఖ్యంగా హుజుర్నగర్ ఎన్నికల్లో విజయం సాధించి ఒక రికార్డును సృష్టించింది అన్నారు.ఎన్నారై కో ఆర్డినేటర్ బిగాల మహేష్, ఎన్నారై శాఖల ఇంచార్జ్ కల్వకుంట్ల కవిత గైడెన్స్ తో పక్కాగా అమలు పర్చామన్నారు.గత సంవత్సర కాలములో టీఆర్ఎస్ పార్టీ సాధిస్తున్న అద్బుత విజయాలలో తమవంతు పాత్రని పోషించామని, ఇక మీదట కూడా అలాగే కొనసాగిస్తామని తెలిపారు .
Post Views: 477