మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా చేస్తున్నారు. ఒక్క మొన్న ఐదేళ్ళ పాలనలోనే ఇంత జరిగితే అంతకముందు ఎంత చేసి ఉంటారో మీరే ఆలోచించండి. అధికారం ఉండనే అహంకారంతో ప్రజల పట్ల రౌడీలుగా ప్రవత్తించారు. రక్షించాల్సిన వారే వారికి కొమ్ముకాసారు. ఇలా గడిచిన ఐదేళ్లలో ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే జరిగాయి. ప్రజల సొమ్మును మొత్తాన్ని అమాంతం మింగ్గేసారు. దీనిపై ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్వభావం మొదటి నుంచి అంతే. ప్రజా ధనాన్ని తన సొత్తు అన్నట్టుగా అడ్డగోలుగా లూటీ చేస్తాడు. అడ్డం తన్నగానే తన బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తాడు. ఎల్లో మీడియా మోత మోగించే రోజుల్లో అయితే ఆడింది ఆటగా సాగేది? సోషల్ మీడియా సూర్యుడు పొడిచాక చీకటి చుక్కలు అదృశ్యమయ్యాయి”అని ఆయన ప్రజలకు తెలిసేలా చేసారు.