ప్రముఖ సినీ మాజీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి.
అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి పవన్ కు ఫోన్ కాల్ రావడంతోనే హుటాహుటిన పవన్ ఢిల్లీకి వెళ్లారు అని సమాచారం.
రాజధాని తరలింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పవన్ చర్చించనున్నారు అని సమాచారం. అయితే మరోవైపు అంతకుముందు మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాబై శాతం యువతకు ఇవ్వాలని నిర్ణయించింది.