Home / MOVIES / “సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:

“సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:

మూవీ పేరు-సరిలేరు నీకెవ్వరు
నటీనటులు- మహేష్,రష్మిక మంధాన,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,విజయశాంతి,సంగీత
దర్శకత్వం –అనిల్ రావిపూడి
నిర్మాతలు- అనిల్ సుంకర ,మహేష్ బాబు,దిల్ రాజ్
సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ- ఆర్ రత్నవేలు
ఎడిటింగ్ – తమ్మిరాజు
విడుదల తేది-11.01.2020

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేస్తూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో తనకు ఎవరు పోటీ కాదంటూ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల విడుదలైన మహార్షి దగ్గర నుండి శ్రీమంతుడు వరకు సరికొత్త పంథాను ఎంచుకుంటూ తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మహేష్ . తాజాగా సరిలేరు నీకెవ్వరు అనే మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటించిన మహేష్ అందర్నీ మెప్పించాడా..?. ఎవరు ఎలా నటించారు..?. ఈ మూవీ హిట్టా..?. ఫట్టా..? అని ఇప్పుడు తెలుసుకుందాము.

అసలు కథ ఏమిటంటే
అజయ్ కృష్ణ ఆర్మీలో మేజర్. అందరీ కంటే ఎక్కువగా ధైర్యసాహసాలు కలిగిన పవర్ ఫుల్ అధికారి మహేష్.కొంతమంది స్కూల్ విద్యార్థులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారు. ఉగ్రవాదుల చెర నుండి విద్యార్థులను విడిపించడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపడతారు మహేష్ అండ్ టీమ్. విద్యార్థులను రక్షించే ఆపరేషన్లో ఉన్న హీరోకి.. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా భారతి పాత్రలో నటించిన విజయశాంతి ఎలా ఎంట్రీ ఇచ్చింది. అసలు ఆ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి.?. అజయ్ కు భారతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ..?, అసలు పాలిటిక్స్ ఎలా మొదలయ్యాయి. ఆర్మీ ఆఫీసర్ గా ఉన్న మహేష్ పాలిటిక్స్ లీడర్లను ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది. ఇలా పంశాలను తెలుస్కోవాలంటే సరిలేరు నీకెవ్వరు మూవీ తెల్సుకోవాల్సిందే..?

మూవీ ఎలా ఉందంటే..?
వరుస విజయాలతో.. వరుస చిత్రాలతో మంచి ఊపు మీద ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తమ అభిమాన హీరో నుండి ఒక మంచి మాస్ ఎంటర్ ట్రైనర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులకు,తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ సంక్రాంతి కానుకగా అందించాడు మహేష్. ఆర్మీ ఆధికారిగా మహేష్ లుక్ ,యాక్షన్, ట్రైన్లో కామెడీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. అదే సమయంలో ప్రొఫెసర్ భారతి(విజయశాంతి)ని కాపాడే వ్యక్తిగా మహేష్ రెండు పాత్రల్లో నటించి చూపించిన పలు వేరియేషన్స్ చూపించాడు.స్కూల్ విద్యార్థులను ఉగ్రవాదుల కిడ్బాప్ చేరల నుండి కాపాడే ప్రయత్నం.. విలన్ ప్రకాష్ రాజ్ నుండి ప్రొఫెసర్ భారతిని కాపాడే ప్రయత్నంలో చేసిన యాక్షన్ సీన్స్.. కామెడీ నభూతో న భవిష్యత్తో అన్నట్లు ఉంది వీళ్ల యాక్షన్ చూస్తే. ఇలాంటి సమయంలోనే రష్మిక మంధాన,సంగీత,రావు రమేష్,బండ్ల గనేష్ లాంటి పాత్రలు ప్రవేశిస్తాయి. అప్పటీవరకు సీనియస్ గా సాగిన ఈ కథలో వీరి ఎంట్రీతో కామెడీ మొదలవుతుంది.

ఎవరు ఎలా చేశారు..?
తన కెరీర్ లోనే చాలా తక్కువ సార్లు మాస్ రోల్ లో కనిపించాడు మహేష్. అయితే మాస్ సినిమా చేసిన సినిమాల్లో అత్యధిక శాతం హిట్లు కొట్టాడు. అయితే హీరోగా మాత్రం మహేష్ నూటికి నూరు పాళ్ళు న్యాయం చేసాడు. డ్యాన్స్ లు కానీ, ఫైట్లు కానీ కామెడీ కానీ మహేష్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. మహేష్ ను ఇలా చూసి చాలా కాలం కావడంతో అభిమానులకు పండగే.

విజయశాంతి పాత్ర చాలా హుందాగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించింది. కంబ్యాక్ కు సరైన సినిమా. ప్రకాష్ రాజ్ అవ్వడానికి ఇందులో విలన్ అయినా చాలా షేడ్స్ ఉన్నాయి. తన పాత్రను తీర్చిదిద్దిన విధానమే సరికొత్తగా ఉండడంతో ప్రకాష్ రాజ్ కూడా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజేంద్ర ప్రసాద్ సినిమా అంతటా మహేష్ తోనే కనిపిస్తాడు.

సాంకేతిక నిపుణులు:
దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. మహేష్ ఇంట్రడక్షన్ సీన్, ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఫారెస్ట్ ఫైట్.. ఇలా చాలా సన్నివేశాల్లో దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. పాటల పరంగానూ దేవి మెప్పిస్తాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ చిత్రానికి మెయిన్ ప్లస్. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.

ఎడిటింగ్ మరికాస్త పదునుగా ఉంటే బాగుండేది. సినిమా లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. డైలాగులు చాలా బాగున్నాయి. అనిల్ రావిపూడి సాధారణంగా పెట్టే మ్యానరిజమ్స్ దగ్గరనుండి, రాజకీయ నాయకులకు కరప్షన్ మీద క్లాస్ తీసుకునే సీన్ వరకూ చాలా చోట్ల డైలాగులు పేలాయి. కథ పాతదే అయినా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మహేష్ అభిమానులను దృష్టిలో ఉంచుకునే తీసాడు. ఫ్యాన్స్ స్టఫ్ కోసం చాలానే సీన్లు ఉన్నాయీ సినిమాలో. దర్శకుడిగా అనిల్ రావిపూడి సంతృప్తిపరుస్తాడు. ఇంకా బాగా తీయొచ్చు అనే ఫీలింగ్ కలిగించినా మొత్తంగా చూసుకుంటే మెప్పిస్తాడు.
బలాలు
మహేష్ బాబు
విజయశాంతి
కామెడీ
యాక్షన్ సన్నవేశాలు
బలహీనతలు
ద్వితీయ నిడివ
క్లైమాక్స్
చివరికి.. మహేష్ బాబు అభిమానులకు మీకు ఆర్ధమవుతుందా..?. బొమ్మ దద్దరిల్లిపొద్ది
రేటింగ్ –3.5/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat