సూపర్ స్టార్ మహేష్ హీరోగా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. అంతేకాకుండా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో విజయశాంతి భారతిగా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ సినిమా ఎలా ఉన్న ఒక డాన్స్ విషయంలో కొంచెం కష్టమే అని అనిపిస్తుంది కాని ఈ సినిమాలో డాన్స్ చూసాక ఆ ఒక్క లోటు తీరిపోయింది. ఇందులో మైండ్ బ్లాక్ సాంగ్ లో స్టెప్స్ చూస్తే ఫ్యాన్స్ ఒక్కసారి థియేటర్లలో కేరింతలతో ఊగిపోయారు.
