కొత్త సంవత్సరం అందులో జనవరి వస్తే చాలు ఎవరైనా పండగ ఆనందంలో మునిగిపోతారు. కొందరు కోడిపందాలు వేరే వాటితో బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగ మాత్రం సినిమాలతో పోటీ మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఇక వీరిద్దరూ కూడా 12నే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమానే ఒకరోజు ముందు రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాంతో వారు వెనక్కి తగ్గారని, బయపడి ఉంటారని అందరు అనుకున్నారు. కాని అలా తగ్గడం వల్ల వారికి చాలా మేలు అయిందనే చెప్పాలి. ఎందుకంటే ముందురోజు రిలీజ్ అవ్వడంవల్ల దానికి తోడు దిల్ రాజు దీనికి ఒక నిర్మాతగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో 90శాతం థియేటర్లు మహేష్ సినిమాతో నిండిపోయాయి. దానికితోడు దర్బార్ కూడా అంతగా బాగుందపోవడంతో అది కలిసొచ్చిన అంశమని చెప్పాలి. మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏమిటో మరి. దానికితోడు మహేష్ తో పోల్చుకుంటే అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ తక్కువనే చెప్పాలి.
