గిరిజనుల డోలీల సమస్యకు శాశ్వత పరిష్కారంగా దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిశిఖర గ్రామాలకు రోడ్ ఫార్మేషన్ చేయడానికి ప్రత్యేకంగా 236 రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని, రాష్ట్రంలోని పార్వతీపురం, సీతంపేట, పాడేరు, రంపచోడవరం, కేఆర్ పురం, శ్రీశైలం తదితర ఐటీడీఏల పరిధిలో కొత్త రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, ఈరోడ్ల నిర్మాణాలతో శాశ్వతంగా డోలీల సమస్య పరిష్కారం కానున్నదని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో రహదారుల ఏర్పాటుకు, అదనపు భవనాల నిర్మాణానికి రూ. 130.46 కోట్లు మంజూరు చేశామని పుష్పశ్రీవాణి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గిరిజనుల పక్షపాతి అన్నారు.
