నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… ఆమేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, ఆయా వర్గాల అభ్యున్నతికోసం ఈ కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపు నిచ్చి… వారు సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై చర్చించారు.గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్నదిశగా చర్చ జరిపారు. ఆమేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు.మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. త్వరలో మరోసారి సమావేశం ఉంటుందనిఅందులో తానుకూడా పాల్గొంటానన్న సీఎం ఈ సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సమాజిక వర్గాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆ సమావేశంలో బీసీల అభ్యున్నతికోసం ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సీఎం అన్నారు.. సమావేశంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులుప పాల్గొన్నారు.