ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కోల్‌కతా పర్యటనలో భాగంగా బెంగాల్ వచ్చారు. పర్యటనలో భాగంగా కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ 150 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగానే రాజ్ భవన్ లో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత ను కలిసారు.పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇటీవల చేసిన నిరసనలను చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ సీఏఏ, ఎన్నార్సీ మరియు ఎంపీఆర్ కు వ్యతిరేకం అని చెప్పడంతో. మోదీ ఆ విషయంపై ఢిల్లీలో చర్చిదాం అని అన్నారని మమత చెప్పారు.