తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మేడారం మహాజాతర జరగనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే మేడారంలో పలు ఏర్పాట్లను ప్రభుత్వం ముమ్మరం చేస్తుంది.
మేడారంలో సమ్మక్క సారలమ్మ మహాజాతరలో భక్తులకు,ప్రజలకు అవసరమైన సకల సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుంది. అందులో భాగంగానే జాతర జరగనున్న ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మేడారంలో యాబై పడకలతో కూడిన అత్యాధునీక టెక్నాలజీ సౌకర్యాలున్న ప్రత్యేక ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్యాశాఖ నిర్ణయించింది.
దానికి సమ్మక్క సారలమ్మ వైద్యాశాలగా నామకరణం చేయనున్నారు. ఈ ఆస్పత్రిలో నూట ఇరవై మంది వైద్యులు తమ విధులను నిర్వహించి.. అవసరమైన వారికి సేవలను అందించనున్నారు.