టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత కొద్ది రోజులుగా క్రికెట్ నుండి రిటైర్మెంట్ కానున్నాడని వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మాజీ ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లు ధోనీ రిటైర్మెంట్ పై పలురకాలుగా వ్యాఖ్యలు చేశారు.
తాజాగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” గతేడాది ప్రపంచ కప్ టోర్నీ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తోన్న ఎంఎస్ ధోనీ త్వరలోనే వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతారని అన్నారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వూలో గురువారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ”పలు విషయాలపై మాట్లాడారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ”ధోనీతో నేను మాట్లాడాను. ఇప్పటికే అతడు టెస్టుల నుండి తప్పుకున్నాడు.త్వరలోనే వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని”అన్నారు.