సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం టీమ్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే రష్మిక ఇద్దరు వ్యక్తులకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వారు మరెవ్వరో కాదు ఇటీవలే యుట్యూబ్ ఛానల్ ద్వారా ఫుల్ ఫేమస్ అవుతున్న సితార మరియు ఆద్యనే. వీరిద్దరు గురువారం ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూ చేసారు. అనంతరం రష్మిక ఈ చిచ్చరపిడుగుల మాటలు చూసి ఆశ్చర్యపోయింది. ఈ వయసులోనే ఇలా ఉంటే పెద్ద అయ్యాక సితార ఫుల్ ఫేమస్ అయిపోతుంది అనడంలో సందేహమే లేదని తెలుస్తుంది.
