పోకిరి సిన్మాలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ సీన్ గుర్తుందా.. భిక్షం వేయమన్నందుకు కసురుకున్న బ్రహ్మానందానికి ఆలీ, వేణుమాధవ్ వంటి బెగ్గర్స్ చుక్కలు చూపిస్తారు..బ్రహ్మీ ఎక్కడకు పోతే అక్కడకు బెగ్గర్స్ బ్యాచ్ వెంటపడుతూ భిక్షం వేయమని టార్చర్ పెడుతుంటారు..సిన్మాలో ఈ బ్రహ్మీ బెగ్గర్స్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది..ముఖ్యంగా బెగ్గర్స్ బ్రహ్మీ వెంటపడేటప్పుడు బబబా..బబబా..అంటూ బీజీఎం వస్తుంటే..థియేటర్లలో నవ్వులే నవ్వు.. అలా పోకిరీలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ ఓ రేంజ్‌లో పండింది. సేమ్ సీన్ రాజకీయాల్లో కూడా రిపీట్ అయింది..అయితే ఇక్కడ కాస్త రివర్స్..మన శ్రీ మాన్ చంద్రబాబు గారు రివర్స్‌లో ప్రజలను అడుక్కుంటూ టార్చర్ పెట్టారు. బందర్‌లో బాబు గారు చేసిన బెగ్గింగ్ డ్రామాపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పడుతున్నాయి.
ఇదే చంద్రబాబు ఐదేళ్ల క్రితం అమరావతి అనే సామ్రాజ్యానికి చక్రవర్తిలా బిల్డప్ ఇచ్చాడు..రాజధాని కట్టిస్తా అంటూ..33 వేల ఎకరాలు రైతుల దగ్గర లాక్కుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. ఆయనే కాకుండా..ఆయన సామాజికవర్గానిక చెందిన మాజీమంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, వ్యాపారస్థులకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా…4 వేల ఎకరాలు ముందుగానే దోచిపెట్టాడు. గత ఐదేళ్లు చంద్రబాబు ఎంత రాజభోగం అనుభవించాడు.. ఊ అంటే సింగపూర్..ఆ అంటే అమెరికా..ఇ అంటే ఇఫ్లాంబుల్ అని స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని ఎంజాయ్ చేశాడు..బాహుబలిని మించిన గ్రాఫిక్స్‌తో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించాడు. ఒక చక్రవర్తిలా జయము జయము చంద్రన్న అంటూ తన ఘనకీర్తిపై వంధిమాగధులతో పాటలు పాడించుకున్నాడు.. ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కాకుండా…చిన్నవర్షం వస్తే కురిసే మూడు తాత్కాలిక భవనాలు కట్టి..ఇదే సింగపూర్ స్థాయి రాజధాని అన్నాడు..అప్పుడు లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి..బిల్డప్ ఇచ్చి…ఇప్పుడు నయా పైసా ఖర్చు లేదంటూ నాలుక మడతేస్తున్నాడు..
అందుకే జగన్ అధికారంలోకి రాగానే వాస్తవాలు కనిపెట్టి..మూడు రాజధానుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాడు..ఇక్కడ బాబుగారికి భయమల్లా తమ భూముల గురించే..అందుకే ఆడవాళ్ల గాజులు, దిద్దులు, కాళ్లపట్టీలు అడుక్కోవడం దగ్గర నుంచి జోలెపట్టుకుని అమరావతి కోసం అడుక్కునే స్థాయికి దిగజారిపోయాడు… ఆ మహిష్మతి సామ్రాజ్యానికి బాహుబలి చక్రవర్తి అయితే…ఈ అమరావతి సామ్రాజ్యానికి తనను తాను ఓ చక్రవర్తిలా రాజరికం అనుభవించిన బాబుబలి.. ఆఖరకు ఇంత బతుకు బతికి జోలె పట్టుకుని అడుక్కోవాల్సి వచ్చింది..నిజంగా బాబుగారిని జోలెపట్టించిన జగన్‌ను..ఆడు మగాడ్రా బుజ్జీ అంటూ పొగుడుతున్నారు. మొత్తంగా బాబుగారు జోలె పట్టి అడుక్కోవడంపై నెట్‌జన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.