తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఎప్పటి నుండో మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో ప్రతి ఏటా మైనార్టీ సోదరులను హజ్ యాత్రకు పంపుతున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా తాజాగా సిద్దిపేట మినీ హాజ్ హౌస్ నుండి మంత్రి హారీష్ రావు తన సొంత నిధులతో మొత్తం పదహరు మంది ముస్లీంలను హజ్ యాత్రకు పంపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ,రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ ఖాదర్ ను రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎస్కే మహ్మద్ సన్మానించారు.
ఫారుఖ్ హుస్సేన్ మాట్లాడుతూ” తన సొంత నిధులతో మైనార్టీ సోదరులను హజ్ యాత్రకు పంపించడం చాలా అభినందనీయమని”అన్నారు.