సినిమాలు పరంగా ఎన్ని చిత్రాలు ఎలా ఉన్నా కమర్షియల్ చిత్రాలకున్న కిక్కే వేరని చెప్పాలి. దానికొచ్చే స్టార్ డమ్ వేరే. ఎంత ఎలాంటి హీరో ఐనా సరే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు చెయ్యాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల సినిమా, అటు వసూళ్ళు పరంగా గట్టిగా వస్తాయి. ఇక మహేష్ విషయానికి వస్తే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమా ఒక మెసేజ్ చూపించారు. కాని ఇక నుండి ఆయనకూడా కమర్షియల్ అంటే పోకిరి, దూకుడు వంటి చిత్రాలకే ఓకే చెప్పనున్నారు. వంశీ పైడిపల్లితో తియ్యబోయే నెక్స్ట్ సినిమా ఇలానే ఉండబోతుందట. అదేగాని నిజం అయితే మహేష్ ఫ్యాన్స్ కు పండగ అని చెప్పాలి.