మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం అక్రమాలకూ, దౌర్జన్యాలకు పాల్పడి ప్రజలను మోసం చేసారు. దాంతో ప్రజలు విసిగిపోయి ఈ ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబు ని ఓడించాలి అని అనుకున్నారు. అది గమనించిన బాబు ప్రజలను ఎలాగైనా తన వైపు తిప్పుకోవాలని చివర్లో అటు పోలవరం కు బస్సు యాత్ర ఇటు ఎన్నికలకు ముందు ముందు డబ్బులు పంచడం వంటివి చేసారు. కాని చివరికి ప్రజలు న్యాయానికే పట్టం కట్టారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “జయము జయము చంద్రన్న భజనతో మొదలై జోలె పట్టుకునే వరకు వెళ్లింది ఉద్యమం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ 4 వేల ఎకరాల ‘ఇన్ సైడర్’ భూముల కోసం పడరాని పాట్లు పడుతోంది. ఎక్కడ ఒక ప్రాణం పోతుందా అని రాబందులాగా కాచుక్కూర్చుంది” అని అన్నారు.
