సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని ఇచ్చింది. తాజాగా కేసీఆర్ కూడా అనుమతిని ఇవ్వడంతో డిస్ట్రిబ్యూటర్ల పంట పండినట్టే అని చెప్పాలి. ఇక నైజాం పరంగా చూసుకుంటే మొత్తం దిల్ రాజు చూసుకుంటాడు. ఈ లెక్కన బారీగానే కాసులు వర్షం కురవడం ఖాయమని అందరు అంటున్నారు.