సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, నిర్మల్ పట్టణంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన అభివృద్ధికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వందల సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ లో చేరారు. శుక్రవారం శాస్త్రినగర్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నిర్మల్ పట్టణ కాంగ్రెస్ నేతలు అడప పోశెట్టి, పద్మాకర్, రామలింగం, పతికే శ్రీనివాస్, ఎలుగు సుధాకర్, జొన్నల మహేశ్, జనార్ధన్, చందు చరణ్ ఆద్వర్యంలో వందల మంది కార్యకర్తలు గులాబీ గూటికి చేరారు. మంత్రి అల్లోల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…. సీయం కేసీఆర్ పాలన. అభివృద్దిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ సౌకర్యం కల్పించడం, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ప్రజలు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వికలాంగులకు పెన్షన్, వృద్ధులకు ఆసరా పెన్షన్, రైతుబంధుతో పాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసు గెలుచుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌అని చెప్పారు.
నిర్మల్ పట్టణంలో ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పట్టణ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల నిధులతో గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్మల్ పట్టణాన్నిఅభివృద్ది ఎంతో అభివృద్ది చేశామన్నారు. రాబోవు రోజుల్లో కూడా ఇంతకు రెట్టింపు పనులను చేయడానికి కృషి చేస్తామని మంత్రి హామినిచ్చారు.