ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులను,సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి తారీఖు నుండి వార్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని ఏపీ సర్కారు ఆదేశాలను కూడా జారీ చేసింది.
తాజాగా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల విధులను ఎనిమిది గంటలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు అదనంగా పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు ప్రభుత్వం తెలిపింది.
అయితే అంతకుముందుదాక కూడా డ్రైవర్లు దూరప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తే ఓవర్ డ్యూటీలు కూడా చేయాల్సి వచ్చేది. ఇటు సంక్రాంతి పండుగకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో యాబై శాతం వరకు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే తిరుగుప్రయాణాల్లో ఈ బస్సుల్లో సాధారణ చార్జీలకంటే నలబై శాతం తగ్గించనున్నారు.