టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్‌లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ కోనేరు సెంటర్‌లో అమరావతి జేఏసీ సభలో చంద్రబాబు మాట్లాడుదామనుకుని వెళ్లారు. అయినా మధ్యాహ్నం 3 గంటల సమయానికి కోనేరు సెంటర్‌లో 200 మంది కూడా లేకపోవడంతో టీ బ్రేక్ పేరుతో సుల్తాన్ పూర్‌లో కాసేపు టైమ్‌పాస్ చేసి, సాయంత్రం నాలుగింటికి బందర్ చేరుకున్నారు..అప్పటికీ జనం లేకపోవడంతో భిక్షాటన పేరుతో కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. బాబుగారు భిక్షగాడి పాత్రలో జీవించేశారంటే నమ్మండి..అమ్మా..అమరావతి కోసం నాలుగు డబ్బులు వేయండమ్మా అంటూ జోలె పట్టి భిక్షం అడిగారు..ఈ క్రమంలో ఓ పెద్దావిడ దగ్గరకు వెళ్లి డబ్బులు వేయాలని బాబుగారు అడిగారు. దీంతో ఆ పెద్దావిడ నీకెందుకేయాలి…ఏం చేశావని వేయాలని నిలదీసింది..అమరావతి కోసం వేయమ్మా అని బాబుగారంటే..నువ్వేమైనా కట్టావా అని ఓ పెద్దావిడ బాబుగారిని దులిపిపారేసింది. దీంతో బాబుగారు చిన్నబుచ్చుకుని మెల్లగా అక్కడనుంచి తప్పుకున్నారు. మొత్తంగా బందర్‌లో చేసిన భిక్షాటన డ్రామాలో చంద్రబాబుకు చుక్కెదురు అయింది.
