ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి రైతులకు ఒక రాజధాని గ్రామాల్లో తప్పా..మిగిలిన రాష్ట్రంలో మద్దతు కరువైంది. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడానికి చంద్రబాబు అమరావతి జేఏసీ ఏర్పాటు చేయించి, బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టాడు. అంతే కాదు నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేయడం, మహిళల నుంచి గాజులు, ఉంగరాలు, దిద్దులను విరాళాల పేరుతో నిలువు దోపిడీ చేయడం, జోలె పట్టి భిక్షాటన చేయడం..ఇలా రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని బాబు రక్తి కట్టిస్తున్నాడు. అయితే రాజధాని ఆందోళనలపై ఎల్లోమీడియాతో పాటు లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ బ్రహ్మాండం బద్ధలైపోతున్నట్లుగా ప్రచారం చేస్తోంది. గతంలో వరదల సమయంలో టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌కు రైతు వేషం వేయించి సీఎం జగన్‌ను, మంత్రి అనిల్‌కుమార్‌ను కులంపేరుతో దూషింపజేసి ఆ వీడియోను లోకేష్ టీమ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. అలాగే తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి, టీటీడీ వెబ్‌సైట్, క్యాలెండర్‌లో యేసు పదం అంటూ ఎల్లోమీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా టీమ్ దుష్ప్రచారం చేసింది. ఈ ఘటనల్లో కొందరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు.
అయినా సిగ్గులేని లోకేష్ టీమ్ తాజాగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య పోస్టులు, వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో పడింది. ఒకపక్క అమరావతి ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు చంద్రబాబు శవరాజకీయం చేస్తున్నాడు. రాజధానిలో గుండెపోటుతో ఓ వ్యక్తి సహజమరణం పాలైతే..రాజధాని తరలింపుపై ఆందోళనతో చనిపోయాడని ఆరోపిస్తూ టీడీపీ శవరాజకీయానికి పాల్పడింది. బాబు శవరాజకీయాల్లో భాగంగా టీడీపీ సోషల్ మీడియా టీమ్ మరో కుట్రకు తెరతీసింది. తాజాగా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారనే బెంగతో ఓ రైతు ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసింది. అయితే ఈ వీడియోపై ఆరా తీయగా… అది తమిళనాడుకు చెందిందని తేలింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడితే… అతడి మృతిని టీడీపీ రాజధాని ప్రాంతానికి ఆపాదించి ప్రభుత్వాన్ని బద్నాం చేసింది. అయితే ఈ వీడియో తమిళనాడుకు చెందింది కావడంతో టీడీపీ కుట్ర బట్టబయలైంది. టీడీపీ శవరాజకీయాలపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. అయినా చంద్రబాబుకు శవరాజకీయం చేయడం కొత్తేం కాదు.. ఇటీవల కోడెల చనిపోయినప్పుడు, ఉల్లిగడ్డల కోసం ఓ వ్యక్తి రైతుబజారులో చనిపోయాడని, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు చనిపోయారంటూ బాబు చేయించిన శవరాజకీయాన్ని ఎవరూ మర్చిపోలేరు. మొత్తంగా రాజధాని పేరుతో తండ్రీ కొడుకులు మరోసారి శవరాజకీయం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది..ఛీఛీ వీళ్లు జన్మలో మారరు కాక మారరంటూ..నెట్‌జన్లు ఓ రేంజ్‌లో బాబు, లోకేష్‌పై విరుచుకుపడుతున్నారు.