ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టాడు. రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని .. రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అండ్ బ్యాచ్ ధర్నాలు .ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.
ఇందులో భాగంగా గురువారం అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోలెపట్టి ఉద్యమానికి అవసరమైన నిధులను సేకరించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ” నా జీవితంలోనే తొలిసారిగా జోలె పట్టి ప్రజలను ఆర్జిస్తున్నాను.
ప్రజా రాజధాని కోస.. భావితరాల కోసం జోలె పట్టాను. మచిలీ పట్టణం ప్రజలు స్పందించి ఇచ్చిన విరాళాలను అమరావతి జేఏసీకి అప్పగిస్తున్నాను .అమరావతి నిర్మాణం కోసం కూడా ప్రజలు యాబై ఏడు కోట్లను విరాళాలుగా ఇచ్చారని ఆయన
అన్నారు.