ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ లేకపోతే తనకు అదికారానికి ఎదురు లేదని చంద్రబాబు అనుకున్నారని, అందుకే ఆయనను అడ్డు లేకుండా చేసుకునేందుకు కుట్ర పన్ని జైలుకు పంపించారని పోసాని అన్నారు. అయినా జగన్ తన పట్టు వీడకుండా ప్రజలలో తిరిగి వారి ప్రేమ చూరగొని అదికారం సాదించారని ఆయన అన్నారు. ఏ ప్రభుత్వానికి అయినా విధానాలు ఉంటాయని ఆయన అన్నారు. రాజధాని కి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేమని, ఆ డబ్బుతో మూడు చోట్ల వివిధ ప్రాజెక్టులు చేపట్టవచ్చని భావిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఈ విదానం నచ్చకపోతే చంద్రబాబు కాని, ఆయన పార్టీ వారు కాని ఆందోళనలకు దిగడం సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబు అప్పట్లో డబ్బు ఎలా వృదా చేశాడో చూశామని ఆయన అన్నారు.
