టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు ఆగమైపోతున్నాయంటూ అమరావతి రైతుల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాడు. ఇదే చంద్రబాబు ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నాడు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత కరెంట్ పథకం ప్రకటిస్తే..కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవడమే అని హేళన చేశాడు. కరెంట్ ఛార్జీలు తగ్గించమని రైతులు బషీర్‌బాగ్‌లో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే..వాళ్లని గుర్రాలతో తొక్కించి..తుపాకులతో కాల్పించి చంపిన ఫాసిస్ట్,,,చంద్రబాబు. తన హెరిటేజ్ పాల వ్యాపారం కోసం సొంత జిల్లాలోని చిత్తూరు డైరీతో సహా పాల సహకార సంఘాలన్నింటిని మూసివేసే పరిస్థితికి తీసుకువచ్చాడు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు అమరావతి ఆందోళనలో రైతుల పేరుతో రాజకీయం చేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. బాబు అమరావతి డ్రామాలపై ట్వీట్ చేస్తూ.. వ్యవసాయం దండగ, ఉచిత కరెంటిస్తే వైర్లపై బట్టలు ఆరేసుకోవడం తప్ప సరఫరా ఉండదని హేళన చేశాడు. సహకార పాల సంఘాలన్నిటిని దెబ్బకొట్టి తన హెరిటేజ్ డెయిరీని డెవలప్ చేసుకున్నాడు. ఇప్పుడు బినామీల భూముల కోసం రైతుల పేరుతో నాటకాలాడుతున్నాడు. వాటే విజన్ బాబ్జీ! అంటూ విజయ సాయిరెడ్డి సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమరావతి రైతుల ఆందోళనల కార్యక్రమాల్లో బాబుగారి ఓవరాక్షన్ చూస్తుంటే…వాటే విజన్ బాబ్జీ అని అనక తప్పదు..కుటిల రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
