Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌ ముందు బాబుగారి ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా…!

సీఎం జగన్‌ ముందు బాబుగారి ఇజ్జత్ తీసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా…!

ఏపీ సీఎం జగన్ ఇవాళ మరో చారిత్రక పథకానికి శ్రీకారం చుట్టారు. చిత్తూరులోని పీవీకేఎన్ ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో అమ్మఒడి పథకాన్ని సీఎ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న అమ్మఒడి పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని ప్రశంసలు కురిపించారు. ప్రతి బిడ్డ చదువుకుంటేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని చెప్పారు. పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్‌ ఈరోజు అమ్మ ఒడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక నుంచి అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్‌ అంటారని రోజా చెప్పారు.. చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించినందుకుగాను సీఎం జగన్‌కు రోజా ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై రోజా నిప్పులు చెరిగారు. 14 ఏళ్లు సీఎంగా చేశా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరు‌కు చేసింది ఏమీ లేదని ఫైర్ అయ్యారు,. పేదపిల్లల చదువు కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన చరిత్రకారుడు వైఎస్‌ జగన్‌ అయితే.. పేదల చదువును కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. పేదపిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొచ్చిన చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. పేదలు చదివే 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేసిన చరిత్రహీనుడు చంద్రబాబు నాయుడు అని రోజా ధ్వజమెత్తారు.. మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం అందించిన చరిత్రకారుడు జగన్‌ అయితే.. ఆ పేదపిల్లలు తినే కోడిగుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని ఆమె ఎద్దేవా చేశారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తున్న చరిత్రకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. తను చదివిన పాఠశాలను కూడా అభివృద్ధి చేయలేని చేతకాని చరిత్రహీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే రోజా తీవ్రంగా దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా ఇచ్చిన చరిత్రకారారుడు జగన్‌ అయితే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రూ.35 వేలకు కుదించిన చరిత్రహీనుడు చంద్రబాబు అంటూ తనదైన స్టైల్లో చంద్రబాబుకుపై రోజా విరుచుకుపడ్డారు. రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. నిజమే కదా ప్రభుత్వ విద్యావ్యవస్థను ధ్వంసం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాసిన చంద్రబాబు నిజంగా చరిత్రహీనుడే అంటూ… నెట్‌జన్లు రోజా వ్యాఖ్యలకు మద్దతు పలుకుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat