Home / ANDHRAPRADESH / సంచలనం… వివేకా హత్యకేసులో చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..!

సంచలనం… వివేకా హత్యకేసులో చంద్రబాబుకు హైకోర్ట్ నోటీసులు..!

మాజీమంత్రి వివేకా హత్యకేసుపై సిట్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును సిబీఐ అప్పగించాలంటూ..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిలు హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తాజాగా వివేకా హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్ట్‌ నోటీసులు జారీ చేసింది. బాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది. ప్రస్తుతం సిట్ చేస్తున్న దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూ గతంలో సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఉత్తర్వులిచ్చారు.

కాగా వివేకా హత్య కేసును హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని గతంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్‌ జగన్, వివేకా సతీమణి సౌభాగ్యమ్మలు హైకోర్టులో పిటీషన్ వేశారు. తాజాగా ఇదే అభ్యర్థనతో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవిలు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా ఆదినారాయణరెడ్డి తరఫు న్యాయవాది వెంకటరమణ, సౌభాగ్యమ్మ తరఫు సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి, ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వివేకా హత్యకేసులో సిట్ చేస్తున్న దర్యాప్తు చాలా కీలక దశలో ఉందని ఏజీ చెప్పారు. ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవిలకు ఏదో ఇబ్బంది ఉందని, వారిని విచారణకు పిలిపిస్తున్నామన్న కారణంతో సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కోరుతున్నారని ఏజీ కోర్టుకు తెలిపారు. మొత్తంగా వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తుతో పాటు, హైకోర్టు‌లో వివిధ వ్యాజ్యాలపై విచారణలు ముమ్మురంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం వివేకా హత్యకేసులో చంద్రబాబుకు కూడా హైకోర్ట్ నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. మరి ఈ నోటీస్‌పై బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat