అమరావతిలో గత 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు మద్దతు పలుకుతున్నారు. చంద్రబాబు రోజుకో కార్యక్రమంతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నాడు. కాగా బుధవారం నాడు అనుమతి లేకున్నా బెంజి సర్కిల్ నుంచి ఆటోనగర్ యాత్ర వరకు పాదయాత్ర చేయడం ద్వారా రాజకీయం చేయాలని చూసిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్ర చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు తెలిపారు. దీంతో చంద్రబాబు పోలీసులపై ఓవరాక్షన్ చేశాడు..మాజీ సీఎంను నన్నే అడ్డుకుంటారా..నేను పాదయాత్ర చేసి తీరుతా అని రోడ్డుపై బైఠాయించాడు. దీంతో పోలీసులు బాబు, ఆయన తనయుడు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని బస్‌లో తరలించి ఆయన ఇంటిదగ్గర దింపేశారు.
అయితే చంద్రబాబు రోడ్డుమీద కూర్చుని హైడ్రామా క్రియేట్ చేస్తే..పవన్ మాత్రం మా పార్టనర్‌ను రోడ్డుమీద కూర్చోపెడతారా అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. శాంతియుతంగా కొనసాగుతున్న ఉద్యమాన్ని అరెస్టులతో రెచ్చగొడుతున్నారా? అని జనసేనాని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేశారని పవన్ విరుచుకుపడ్డారు. అరెస్టులు, అణచివేతలాంటి ప్రభుత్వ చర్యలతో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజధాని ప్రాంతాన్ని మరో నందిగ్రామ్‌గా మార్చాలని జగన్ సర్కారు చూస్తుందంటూ పవన్ ఆరోపించారు.
అయ్యా పవనూ….చంద్రబాబు స్వార్థం కోసం అమరావతిపై రాజకీయం చేస్తుంటే నీకు పోరాటంలాగా కనిపించిందా..అయినా తన సామాజికవర్గం ప్రయోజనాల కోసం బాబు రోడ్డుమీద కూర్చుంటే నీకు బాధ వేసింది..అదే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం వైజాగ్ వెళితే..ఇదే పోలీసులతో నాడు అధికారంలో ఉన్న మీ పార్టనర్ చంద్రబాబు జగన్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకున్నాడు. అప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ రన్‌వే పై కూర్చుంటే ఆనాడు నువ్వు ఎందుకు నోరు తెరవడం లేదు…ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు కావాలని రోడ్డు మీద కూర్చుని రచ్చ చేస్తే..ఎందుకు నోరు లేస్తుంది..ఇక్కడే అర్థమై పోయింది..మిమ్మల్ని బాబు పార్టనర్, ప్యాకేజీ స్టార్ అని ఎందుకు అంటారో.. మొత్తానికి బాబుకు చిన్నదెబ్బ తగిలితే మీరు అబ్బా..అనేలా ఉన్నారు..అంతా ప్యాకేజీ మహిమేనా సారూ..అని నెట్‌జన్లు పవన్‌పై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.