శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు పాకిస్తాన్ లో బందీలుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు. మొత్తానికి వాళ్లకి విముక్తి కలిగి ఇంటికి చేరుకున్నారు. సీఎం జగన్ ఇంత మంచి పని చేస్తే హర్షం వ్యక్తం చేయడం మానేసి చివరికి మత్స్యకారులును కూడా వదలకుండా ఏవేవో మాటలు అంటున్నారు.”పాకిస్థాన్ చెరలో 14 నెలల పాటు నరకమనుభవించిన మత్స్యకారులు సీఎం జగన్ గారి చొరవతో విడుదలయ్యారు. సొంత ఊళ్లకు చేరి సంబరాలు జరుపుకుంటుంటే చంద్రబాబు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నాడు. సీఎం గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని దాడులు, అరాచకాలు మొదలు పెట్టాడు.