తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో రగిలిన కార్చిచ్చు హృదయవిదారకంగా ఉందని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
ఆ బాధను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదని అన్నారు. లక్షలాది వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. అగ్నికీలలు త్వరగా చల్లారాలి.
ఆస్ట్రేలియాకు మంచి జరగాలి అని ప్రార్థించాలంటూ బుధవారం ట్విట్టర్లో సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.