సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బృహత్తర ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజాసంకల్సయాత్ర పూర్తయ్యి నేటికి సరిగ్గా ఏడాదైన నేపథ్యంలో ఇదే రోజు ప్రతిష్టాత్మక ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించడం విశేషం. అయితే మధ్యాహ్న భోజన పథకంలో మార్పులను గురించి ప్రస్తావించారు. ఇదే సమయంలో ఆయాలకు గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజనం పథకంలో కొత్త మెనూ ఇదే..
సోమవారం: అన్నం, చారు, ఎగ్‌కర్రీ, స్వీట్, చిక్కీ
మంగళవారం: పులిహోర, టమోటో పప్పు, గుడ్డు
బుధవారం: వెజిటెబుల్ రైస్, ఆలూ కుర్మా, గుడ్డు, స్వీట్, చిక్కీ
గురువారం: కిచిడీ, టమోటా చట్నీ, గుడ్డు
శుక్రవారం: అన్నం,ఆకుకూర పప్పు, గుడ్డు, స్వీట్, చిక్కీ
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్