అమరావతి ఆందోళనకారులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనం కార్యక్రమం హింసాత్మకంగా మారింది. గుంటూరు జిల్లా, చినకాకాని వద్ద సర్వీస్ రోడ్డులో వెళుతున్న ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును అడ్డుకున్న కొందరు ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. అంతే కాదు అడ్డుకోబోయిన పిన్నెల్లి గన్‌మెన్‌లపై కూడా భౌతికదాడికి పాల్పడ్డారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా.. పిన్నెల్లి మాత్రం సంయమనం పాటించి…గన్ ఫైరింగ్ ఓపెన్ చేయకుండా జాగ్రత్తపడ్డారు. ఒక వేళ పిన్నెల్లిపై జరిగిన దాడి ఘటన హింసాత్మకంగా మారి రైతులు ప్రాణాలు కోల్పోతే..జాతీయ స్థాయిలో రచ్చ చేయాలని భావించిన టీడీపీ పాచిక పారలేదు.
అయితే తనపై జరిగిన దాడి ఘటనపై పిన్నెల్లి స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేస్తున్నారని, సర్వీసు రోడ్డులో నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా తనపై దాడికి పాల్పడ్డారని… ఆ దారిలో వైసీపీ నేతలు – ఎమ్మెల్యేలు – మంత్రులు ఎవరు వెళ్లినా దాడి చేయాలని ప్లాన్ చేసి అక్కడ కాపు కాశారని..పిన్నెల్లి చెప్పారు. తన కారుపై పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేశారని.. పెద్ద పెద్ద రాళ్లు విసిరారని.. రైతులైతే వారి వద్ద రాళ్లు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. తన కారుపై దాడి చేసింది రైతులు కాదని.. చంద్రబాబు పంపిన మనుషులని ఆయన ఆరోపించారు.
రైతుల ముసుగులో రాజకీయాలు చేయొద్దని.. మగాడివైతే ముందుకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది తగదని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రైతులను దగా చేయాలని చూస్తున్నారని, బాబు ట్రాప్ లో పడొద్దంటూ రైతులకు పిన్నెల్లి సూచించారు. చంద్రబాబు అవుట్‌డేటెడ్ పొలిటీషియన్ అని ఇక ఆయన తన మనవడితో ఆడుకోవడం మంచిదంటూ సెటైర్లు విసిరారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ముసుగు తీసుకుని ముందుకు రావాలన్నారు. హిజ్రాల్లాగా ఇంట్లో కూర్చుని కథ నడపడం కాదు.. దమ్ముంటే మగాళ్లయితే ఎదురుగా రావాలని మరోసారి సవాలు విసిరారు… డైరెక్ట్‌గా తనను టచ్ చేస్తే ఏం జరగాలో అది జరుగుతుందంటూ పిన్నెల్లి తీవ్ర హెచ్చరికలు చేశారు. మొత్తంగా తన కాన్వాయ్‌పై జరిగిన దాడి నేపథ‌్యంలో.. చంద్రబాబు…నువ్వు మగాడివైతే డెరెక్ట్‌గా రా అంటూ పిన్నెల్లి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి.