Home / ANDHRAPRADESH / మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

మరోసారి కాడి ఎత్తేసి మరీ కామెడీ చేస్తున్న పవన్ కల్యాణ్..!

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడులైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ షరామామూలుగా కాడిపడేశాడు గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అంటే భయంలేదు.. తెలంగాణలో కూడా బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని పవన్ వీరావేశంతో డైలాగులు వేశారు. అయితే తీరా ఎన్నికల సమయానికి మాకు అంత సమయం లేదు..ఇప్పుడు మా దృష్టంత ఆంధ్రప్రదేశ్‌‌పై ఉంది..భవిష్యత్తులో కచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేస్తాం అన్నాడు. అయితే పవన్ పార్టనర్ చంద్రబాబు మాత్రం మహాకూటమి గట్టి.. కేసీఆర్‌ను ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలికారు. పాపం కాంగ్రెస్ పార్టీ.. కొద్దొ గొప్పో గెలిచే అవకాశం ఉన్నా బాబుగారి లెగ్గు పవర్‌కు, కేసీఆర్ దెబ్బకు చిత్తుగా ఓడిపోయింది. అటు ఏపీలో కూడా బాబు ఘోర పరాజయం పాలయ్యాడు. తెలంగాణలో అయితే టీడీపీ దుకాణం పూర్తిగా బంద్ అయినా..బాబుకు ఆశ చావలేదు….హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే పట్టుమని టీడీపీకి 1500 ఓట్లు రాలేదు..ఈ దెబ్బతో టీడీపీ సమాధి అయిపోయిందనే చెప్పాలి. కాగా తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో తెలంగాణలో అరా కొరగా ఉన్న జనసేన శ్రేణులు ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలని భావించారు. అయితే పవన్ మళ్లీ కాడి ఎత్తేసాడు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించాడు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ” కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పార్టీపరంగా గ్లాస్ గుర్తుతో పోటీ చేయడం లేదు..ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గారు అనుమతి ఇచ్చారు. ఎన్నికలలో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ మద్దతు ఉంటుంది”. ఇది…జనసేన పార్టీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోని సారాంశం. మొత్తంగా పవన్ కల్యాణ్‌ తెలంగాణలో అడుగుపెట్టడానికి భయపడుతున్నాడు. కేసీఆర్‌‌‌తో కయ్యం పెట్టుకుని చంద్రబాబే అమరావతి కరకట్టకు పారిపోయాడు..నాకు ఎందుకు వచ్చిన గొడవ అని పవన్ అనుకున్నాడేమో మరోసారి తెలంగాణలో పోటీ చేయకుండా చేతులెత్తేసాడు. మొత్తానికి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఇంతవరకూ ఏ ఎన్నికలలో కూడా సరిగా పోటీ చేసింది లేదు.. ఇందులో కామెడీ ఏంటంటే…పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేయమని పవన్ కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం…ఎలాగూ పోటీ చేయాలనుకున్న వాళ్లు…పోటీ చేస్తారు.. ఈ మాత్రందానికి పవన్ చెప్పాలా..దానికో ఓ ప్రెస్‌నోట్ విడుదల చేయాలా..మరీ కామెడీ కాకపోతే..ఏంటీ పవన్..ఇది..టూమచ్‌గా లేదు..

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat