ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాక్ జైలు నుండి విడుదలైన మత్సకారులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పాక్ సరిహద్దుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?అని అడగగా మత్స్యకారులు మాకు ఫిషింగ్ హార్బర్ నిర్మించి ఇస్తే ఇక్కడే మేం మా కుటుంబాలతో కలిసి ఉంటామని మేము వేటకు వెళ్లిన తర్వాత పట్టే చేపలను బట్టి మాకు కూలీ ఇస్తారు అని అన్నారు. మా ప్రాంతంలో సముద్ర తీరం ఉంది కాని 10–15వేల మంది గుజరాత్‌కు వెళ్లాల్సి వస్తోంది. జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల మేమంతా గుజరాత్‌కు వలస వెళ్లి వస్తోంది అని చెప్పారు. మాకు మీరు నిజంగా ఊపిరి పోశారు, బతికినంత వరకూ మీ పేరు చెప్పుకుంటాం, మీలో ఏదో కనిపించని శక్తి ఉందని, అందుకనే మేం బయటకు రాగలిగామన్నారు. దాంతో జగన్ మత్స్యకారుల కోసం జట్టీలు కట్టించి ఇస్తామని భావనపాడు పోర్టు నిర్మాణంకోసం ప్రయత్నాలు చేస్తున్నాం,మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా ఒక జెట్టీని కేటాయిస్తాం అని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేస్తాం మీరు ఉపాధికోసం వేరే ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఈ ఆర్థికసహాయం మీకు ఉపయోగపడుతుంది అని అన్నారు.