మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నతకాలం వారి దగ్గర వారికి, కుటుంబ సభ్యులకే చెల్లింది. వారి దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. ఇందులో ముఖ్యంగా యెల్లో మీడియా ముఖ్య పాత్ర పోషించింది. చంద్రబాబు చేసిన ప్రతీ పనికి వత్తాసు పలికింది. ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిన సరే అదే మంత్రం జపిస్తుంది ఎల్లో మీడియా. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి కిరసనాయిలు మ్యాప్ వేసి పేజి అంతా పర్చాడు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలు మధ్యలో లేవని ప్రజలందరికీ తెలుసు. దీనికంటే ‘కడుపు మంటను’ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ గారిని కోరవచ్చు గదా?” అని అన్నారు.
