తెలంగాణ రాష్ట్రంలో సంగా రెడ్డి జిల్లా నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే హైవే పై గుమ్మడిదల గ్రామ శివారు నుండి అడవి ప్రాంతం కావడంతో అక్కడ జీవించే వన్యప్రాణులు ఆహారం కోసం అలమటిస్తున్న పరిస్థితి ఎదురైంది.
దీంతో రోడ్డున పోయే వారు పడవేసే ఆహారం కోసం కోతి రోడ్డు దాటుతుండగా నర్సాపూర్ వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో రక్తంతో తడిసి ముద్దయింది.
అదే సమయంలో తన బిడ్డ ఆకలితో ఉండటం చూసి ఆ రక్తపు మడుగులో తన తల్లి తన బిడ్డకు పాలిచ్చిన దృశ్యం అటు వైపు వెళ్లే వారిని కంటతడి పెట్టించింది.
దీంతో తల్లి మాతృత్వం పట్ల చూపించిన ప్రేమ అక్కడివారిని వారి మనసులను కదిలించే చేసింది ఈ దృశ్యం వాహనదారుల కెమెరాకు చిక్కింది…