ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ స్థానికి సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈమేరకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్ట్ ఆదేశించింది. జనవరి 17న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. ఫిబ్రవరి 10న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు విడుదల చేయాలని క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వాలని చెప్పడం జరిగింది.