తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలపై దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.
ఒకే ఆర్డర్‌తో అన్ని పిటిషన్లను డిస్మిస్ చేసింది హైకోర్టు. దీంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పురపాలక ఎన్నికలు జరగనున్నాయి. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు జనవరి 22న ఎన్నికలు నిర్వహించి.. ఈ నెల 25న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ.