2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతిని ప్రతిపాదించారు. అయితే వారి కుటుంబీకులకు, నాయకులకు అందరికి ఎదో ఒకేసారి కల వచ్చినట్టు ముందుగానే పసిగట్టి అక్కడ వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఐతే చంద్రబాబు ముందుగానే ఫిక్స్ అవ్వడంతో ఎవరు ఎన్ని చెప్పిన అమరావతినే రాజధానిగా పెట్టడం జరిగింది. అలా రాజధాని పేరు చెప్పి చిన్నపిల్లలతో సహా విరాళాలు తీసుకొని చివరికి చేతులెత్తేశారు. దీనికి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి “అప్పట్లో రాజధాని నిర్మాణం పేరు చెప్పి ఇటుకులు విక్రయించాడు. స్కూలు పిల్లల నుంచి కూడా విరాళాలు సేకరించాడు. వసూలైన వందల కోట్లు ఏమయ్యాయో తెలియదు. నిర్మాణం ఊసే లేదు. ఇప్పుడు రాజధానిని కాపాడుకునేందుకని మళ్లీ జోలె పట్టాడు. ఇటువంటి వింతలు చంద్రబాబు మాత్రమే చేయగలడు” అని అన్నారు.