Home / SLIDER / ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

తెలంగాణలోవరంగల్‌, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు.

2018 వరల్డ్‌ ఎకనామిక్స్‌ ఫోరంలో బీవీ మోహన్‌ రెడ్డి, గుర్నానిని కలిశానని కేటీఆర్‌ తెలిపారు. అనేక వనరులు ఉన్న వరంగల్‌లో ఐటీ సేవలు అందించాలని కోరాను. అడిగిన వెంటనే మోహన్‌ రెడ్డి, గుర్నాని ముందుకొచ్చారు. మడికొండలో క్యాంపస్‌ ఏర్పాటు చేసిన టెక్‌ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్‌. కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్లగొండలో ఈ ఏడాదే ఐటీ పార్కులు ప్రారంభిస్తామన్నారు. వరంగల్‌ యువతి ప్రతిభ చూసి ఐటీని మరింత విస్తరించాలని నిర్ణయించాం. వరంగల్‌లో ఊహించిన దానికంటే వేగంగా ఐటీ విస్తరిస్తోంది అని మంత్రి పేర్కొన్నారు.

ఐదేళ్లలో తెలంగాణకు 12 వేల పరిశ్రమలు వచ్చాయి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని అవసరమైన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. జౌళి పార్కును వరంగల్‌లోనే ఏర్పాటు చేశాం. వరంగల్‌ జౌళి పార్కులో అతి త్వరలో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తామన్నారు కేటీఆర్‌. తెలంగాణలో అక్షరాస్యతను పెంచేలా కృషి చేస్తున్నాం. యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకొని ముందుకు సాగాలి. గ్రామీణ నియోజకవర్గాల్లో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ – వరంగల్‌ మధ్య స్కైవేల నిర్మాణం. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతాం. ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి వర్ధిల్లుతుంది అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat