ఏపీకి మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు గత 20 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు రైతులను రెచ్చగొడుతూ… కృత్రిమ ఉద్యమం చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు రాజధాని పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని…4 వేల ఎకరాలకు పైగా బినామిల పేరుతో దోచుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనలపై టీడీపీ వివాదాస్పద నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో దోపిడీ జరిగిందని, టీడీపీ, నేతలు వేల కోట్లు దోచుకున్నది వాస్తవమని చెప్పారు. అయితే రాజధాని భూకుంభకోణంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇక మూడు రాజధానులపై స్పందిస్తూ.. తల..కాళ్లు..చేతులు వేరు చేసినట్లుగా ఉందని జేసీ వ్యాఖ్యానించారు. అమరావతి నుంచి రాజధాని మార్పు తప్పదనుకుంటే నెల్లూరుతో కలుపుకుని గ్రేటర్ రాయలసీమ ఉద్యమం చేస్తామని జేసీ హెచ్చరించారు. వెంటనే తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని జేసీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్ తో త్వరలోనే రాయలసీమ ప్రాంత నేతలంతా సమావేశమవుతామని జేసీ చెప్పుకొచ్చారు. ఇక తరచుగా నడ్డా, సత్యకుమార్, కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలను కలుస్తున్న జేసీ…పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియాలో కలిపేస్తే బీజేపీలో చేరుతానంటూ..దేశానికి జాతీయ పార్టీలే అవసరమని, తెలుగుదేశంతో సహా ప్రాంతీయ పార్టీల పీడ వదలాలి అంటూ…సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా అమరావతిలో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారంటూ జేసీ చేసిన ఆరోపణలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో చంద్రబాబుతో సహా టీడీపీ ముఖ్యనేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని వైసీపీ చేస్తున్న ఆరోపణలకు జేసీ వ్యాఖ్యలు మరింత ఊతం ఇస్తున్నాయి. అయితే అమరావతి ల్యాండ్ స్కామ్‌లో వైసీపీ నేతలు కూడా ఉన్నారంటూ జేసీ ఆరోపణలపై విస్మయం వ్యక్తమవుతుంది. చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలు ఎలా ల్యాండ్ ఫూలింగ్‌కు పాల్పడుతారంటూ జేసీని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలే రాజదాని గ్రామాల్లో భూదందాలకు పాల్పడ్డారని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. మొత్తంగా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ..టీడీపీ నేతలు రాజధానిపేరుతో దోపిడీ చేశారని, వేల కోట్లు దోచుకున్నది వాస్తవమని జేసీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి.