ఆస్ట్రేలియాలో 2019 సెప్టెంబర్ 23 న మొదలైన కార్చిచ్చు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం.. ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్, విక్టోరియా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో గత సెప్టెంబర్‌లో రగిలిన కార్చిచ్చు…క్రమేపి విస్తరించుకుంటూ తీవ్ర రూపం దాల్చింది. మొత్తం 60 లక్షల హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. న్యూ సౌత్ వేల్స్‌లో 40 లక్షల హెక్టార్లు, విక్టోరియాలో 8 లక్షల హెక్టార్లలో చెట్లు, పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గంటకు సుమారు 80 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో సెగలు కక్కుతున్న ఈ అగ్నికీలలను అదుపు చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సైనిక బలగాలతో పాటు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో వ్యకులు మరణించారు. కాగా అడవిలో చెలరేగిన మంటలలో వేలాది జంతువులు, వన్యప్రాణులు సజీవ దహనం అవడం ప్రతి ఒక్కరిని మనసులను పిండేస్తోంది. అయితే తాజాగా ఫోటోగ్రాఫర్ బ్రాడ్ ఫ్లీట్ అనే ఫోటోగ్రాఫర్ ఆస్ట్రేలియా కార్చిచ్చు తీవత్రను తెలిపేలా ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో ఓ కంగారు..ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోయి బయటకు రాలేక..మంటలలో సజీవ దహనం అయింది. బ్రాడ్ ఈ ఫోటోను షేర్ చేస్తూ..ఆస్ట్రేలియా మండుతున్నట్లుగా అనిపిస్తోంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో చూసి యావత్ ప్రపంచం కదలిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆవేదన చెందుతున్నారు. గుండె పగలిపోతుంది..కన్నీళ్లు ఆగడం లేదంటూ..నెట్‌జన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా కార్చిచ్చుపై ప్రకృతి ప్రేమికులు, జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్చిచ్చులో వేలాది మూగజీవులు మాడిమసైపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం త్వరగా ఈ మంటలను అదుపులో చేయాలని కోరుతున్నారు. మొత్తంగా ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోయి మంటలలో సజీవదహనమైన ఈ కంగారు ఫోటో యావత్ ప్రపంచాన్ని కన్నీటి సంద్రంలో ముంచెత్తుతుంది.
