ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై కూడా చర్చ ఉండే అవకాశమున్నట్లు సమాచారం.
ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయి పలు అంశాల గురించి చర్చించారు. తాజాగా వీరిద్దరి భేటీపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది..