జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్‌గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్‌ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్‌కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ ఇజ్జత్ తీసేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదరంగా నిలుస్తోందంటూ రాపాక ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోమవారం రాజోలు పంచాయతీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాపాక పాల్గొని ప్రసంగించారు.ఆరోగ్యశ్రీ పథకం 1059 వ్యాధులకు వర్తిస్తుందని, ఏప్రిల్ నాటికి 2059 వ్యాధులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాపాక తెలిపారు. రూ. వెయ్యి ఖర్చు మించిన ప్రతి వ్యాధిని ఈ పథకం కింద వర్తించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భేష్ అన్నారు. అలాగే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డును జారీ చేయడం అభినందించాల్సిన విషయమని రాపాక అన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతు ఇస్తూ..జగన్ సర్కార్‌పై విరుచుకుపడుతుంటే..రాపాక మాత్రం అధికార వికేంద్రీకరణ దిశగా సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటను స్వాగతించారు. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీపై పథకంపై ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. గత కొంత కాలంగా రాపాక వైసీపీలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఆయన జనసేనలో ఉంటూనే వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. రాపాక వ్యవహారశైలి జనసేనానికి ఇబ్బందికరంగా మారింది.. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను సస్పెన్షన్ చేయలేక..పార్టీలో ఉంచుకోలేక పవన్ సతమతమవుతున్నాడు. మరి మరోసారి తన ఇజ్జత్ తీసిన రాపాక విషయంలో పవన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
