కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జిఎన్ రావు బోస్టన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను భోగి మంటల్లో వేయమని వ్యాఖ్యానించిన చంద్రబాబుపై మండిపడ్డారు. బోస్టన్ కంపెనీకి 74 సంవత్సరాల చరిత్ర ఉందని గుర్తు చేశారు. కరెన్సీ నోట్లు మార్పిడి పై ఆ కంపెనీ ఇచ్చిన నివేదిక ను చంద్రబాబు ఎందుకు స్వాగతించారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పకుండా జరుగుతున్న అభివృద్ధిని స్వాగతించాలని హితవు పలికారు. ఇది ఇలా ఉండగా రాజధాని రైతులను ఉద్దేశించి రైతులు తమ వినతి పత్రాలతో ప్రభుత్వాన్ని కలిస్తే జగన్ మేలు చేస్తారని తెలియజేశారు. బాబు మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని చేశారు.