తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇందులో భాగంగా జూబ్లి బస్ స్టేషన్ నుండి ఎంజీబీఎస్ మధ్య మెట్రో మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది.
ఇప్పటికే పూర్తైన ఈ మార్గంలో అన్ని పనులు పూర్తయ్యాయి. గత సంవత్సరం నవంబర్ నెల నుండి ట్రయల్ రన్ నడుస్తోంది. ఈ రన్ లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పరిశీలించడం జరిగింది.
దీనికి సంబంధించిన అన్ని నివేధికలను సంబంధిత సంస్థలకు అధికారులు అందజేశారు.జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ మెట్రో మార్గం మధ్య పదకొండు కిలోమీటర్లు. త్వరలోనే ఈ మార్గంలో మెట్రో పరుగులు పెట్టనున్నది.