తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై నాటి చైర్మన్ అనర్హత వేటు వేశారు.
దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన భూపతిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. చైర్మన్ ఆయనను అనర్హుడిగా ప్రకటించడాన్ని నాడు హైకోర్టు సమర్థించింది.
అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించి హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే స్పష్టం చేశారు.