ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా అదే నిజమని నమ్మించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా..ఎల్లోమీడియా, సోషల్ మీడియా సహాయంతో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లి..లబ్ది పొందడం చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. గతంలో జగన్‌పై లక్ష కోట్ల అవినీతిపరుడు అంటూ పదే పదే ఎల్లోమీడియాలో వూదరగొట్టి ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు కొద్దిమేర సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ)పై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నాడు. అది బీసీజీ కమిటీ కాదు..జగన్ కమిటీ అని అని అక్కసు వెళ్లగక్కుతున్నాడు. ఇదే బీసీజీ కమిటీకి తన హయాంలో చంద్రబాబు పెద్దపీట వేశాడు. పెద్దనోట్ల రద్దు విషయంలో బీసీజీ కమిటీని బాగా వాడుకున్నాడు. అయితే ఇప్పుడు తనకు బంగారు బాతు అయిన అమరావతి నుంచి రాజధాని ఎక్కడ తరలిపోతుందనే దుగ్ధతో నివేదిక ఇచ్చిన బీసీజీ కమిటీపై బురద జల్లేందుకు బాబు కుట్రలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
తాజాగా బీసీజీ కమిటీ వాస్తవ సమాచారం నెటిజన్లకు తెలియకుండా కొందరు పనిగట్టుకుని వికీపీడియాలో ఆ పేజీని ఎడాపెడా మార్చివేశారు. కేవలం రెండురోజుల్లోనే 12 సార్లు వికీపీడియాలో బీసీజీ కమిటీకి సంబంధించిన సమాచారాన్ని మార్చి అది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల కంపెనీ అని, బఫూన్ కన్సల్టెన్సీ అని తప్పుడు సమాచారాన్ని జోడించారు. అయితే బీసీజీ నివేదిక ఇచ్చిన తర్వాత దాని గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు వికీపీడియా పేజీని చూడగా… ఈలోపే దాన్ని ఇష్టానుసారం మార్చి ఆ సంస్థపై దుష్ప్రచారానికి పూనుకున్నారు. ఈ పని చేసింది..టీడీపీ మద్దతుదారులే అని వికీపీడియా యాజమాన్యం విచారణలో తేలింది. కాగా బీసీజీ సమాచారాన్ని పూర్తిగా మార్చివేయడంతో ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో వికీపీడియా యాజమాన్యం తప్పుడు సమాచారాన్ని సరిచేసింది. మొత్తంగా మూడు రాజధానులపై రగిలిపోతున్న చంద్రబాబు అందుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చిన బీసీజీ కమిటీపై మండిపడుతున్నాడు. ఇంకేముంది బీసీజీ కమిటీపై బాబు మార్క్ బురద రాజకీయం మొదలైంది. సదరు కమిటీ విశ్వసనీయత దెబ్బతినేలా ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి…అందుకే బీసీజీ సంస్థ అప్రమత్తంగా ఉంటూ..ఎప్పటికప్పుడు బాబు బ్యాచ్ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.